గడప గడపలో రామ నామ స్మరణ
శ్రీరామ నవమి నాడు భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం లోకమంతటికి శుభకరం, అంత విశేషమైన రామనవమి నాడు మన మందరం కూడా ఎవరికి వారు రామనామాన్ని కనీసం 108 సార్లు జపం చేద్దాం శ్రీ సీతారాముల పరిపూర్ణ అనుగ్రహం పొందుదాం… దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచల దివ్యక్షేత్రంలో పావన గోదావరి తీరంలో శ్రీ నృసింహ సేవా వాహిని వారి ఆధ్వర్యంలో శ్రీరామ నవమి నాడు శ్రీ రామ తారక మంత్ర హోమం నిర్వహించబడుతుంది. రామ నామం జపించిన అందరి గోత్ర నామాలను శ్రీ రామతారక మంత్ర హోమంలో అన్వయించబడుతాయి.!